హైదరాబాద్, నవంబర్ 28, (జే ఎస్ డి ఎం న్యూస్ ) : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వార్షిక క్రీడా పోటీలు.తొలిసారిగా రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ఐ ఆర్ ఎస్ అధికారి అరుణ్ కుమార్. భారత క్రికెటర్ అంబటి రాయుడు హాజరయ్యారు.
వరుసగా మూడో ఏడాది కూడా విజయనగర హౌస్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట (హెచ్‌పీఎస్-బి) చారిత్రాత్మకమైన ఫ్రంట్ ఫీల్డ్‌లో, షహీన్ భవనం నేపథ్యంగా వార్షిక క్రీడా పోటీలను ఘనంగానిర్వహించింది. తొలిసారిగా ఈ క్రీడా పోటీలను రెండు రోజుల పాటు నిర్వహించారు. మొదటి రోజు ప్రైమరీ స్కూల్ (పీపీఐ నుంచి 5వ తరగతి వరకు), రెండో రోజు మిడిల్ మరియు సీనియర్ స్కూల్ విద్యార్థుల కోసం పోటీలు నిర్వహించారు.మొదటి రోజు కార్యక్రమం ముఖ్య అతిథి గా ఐఆర్ఎస్ (కస్టమ్స్ & ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్), హైదరాబాద్ జోన్ మరియువిశాఖపట్నం జోన్ల చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ & జీఎస్టీ అరుణ్ కుమార్ కు పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ బాలీ స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పతాకాన్నిఆవిష్కరించి, ముఖ్య అతిథి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. చిన్నారులు ‘బ్లూమ్ & బౌన్స్’, ‘బీ & బ్లిస్’, ‘ది ఫ్లవర్ గార్డెన్’, ‘రిథమ్ ఇన్ రేడియన్స్’ పేర్లతో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం పరుగు పందాలు, 100 మీటర్ల ట్రాక్ పోటీలు, విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ…… విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. గెలుపు కంటే పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని పేర్కొంటూ, పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులను క్రీడల్లో భాగస్వాములను చేస్తున్నఉపాధ్యాయులు, కోచ్‌లకు కృతజ్ఞతలుతెలిపారు. అనంతరం అశ్వక
దళ ప్రదర్శన నిర్వహించగా, స్పోర్ట్స్ కెప్టెన్ లిపిక పల్లెం వందన సమర్పణతో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి.రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు హాజరయ్యారు. 2004 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గావ్యవహరించిన ఆయన,
అనంతరం 55 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఆరు ఐపీఎల్ టైటిళ్లనుగెలుచుకున్నారు. పాఠశాల పతాకావిష్కరణ, ప్రతిజ్ఞ అనంతరం విద్యార్థుల బృందాలు మార్చ్‌పాస్ట్ నిర్వహించాయి. 6, 7, 8 తరగతుల విద్యార్థులు ‘ఎ కేలిడోస్కోప్ ఆఫ్ ఎనర్జీ’, ‘పవర్ పల్స్ డ్రిల్’, ‘యూనిటీ వారియర్స్’, ‘ఫ్లెక్స్ & ఫ్లో’ పేర్లతో నాలుగు ప్రత్యేక డ్రిల్ ప్రదర్శనలు ఇచ్చారు. వీటితో పాటు జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్ బాలికలు, బాలురకు ట్రాక్ పోటీలు నిర్వహించారు.
4 x 100 మీటర్ల రిలే పోటీతో క్రీడా పోటీలు ముగిశాయి.అనంతరం సిబ్బంది, విద్యార్థుల మధ్య నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీలో ఉపాధ్యాయులు విజయంసాధించడంతో ప్రాంగణమంతా నవ్వులు,కేరింతలతో సందడిగా మారింది. అనంతరం అశ్వకళా ప్రదర్శననిర్వహించారు.ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ బాలీ మాట్లాడుతూ హెచ్‌పీఎస్-బిలో
ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధిని తాము విశ్వసిస్తామన్నారు . ఆ ప్రయాణంలో క్రీడలు ఒక అంతర్భాగం అన్నారు.గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించడమే హెచ్‌పీఎస్-బి స్ఫూర్తి అని అన్నారు. ఇంకా ఆయనమాట్లాడుతూమా విద్యార్థులు జాతీయ,అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగారు. వివిధ క్రీడావిభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు వారిని మేము నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటాముఅని తెలిపారు.విద్యార్థులను ఉద్దేశించి అంబటి రాయుడు మాట్లాడుతూ పాఠశాల రోజుల్లో మీరు సృష్టించుకునే జ్ఞాపకాలు, ఇక్కడ ఏర్పరచుకునే స్నేహాలు జీవితాంతం మీతోనే ఉంటాయి” అని అన్నారు. సానుకూల దృక్పథంతో తమ జీవితాలను ఒక కోటలానిర్మించుకోవాలని సూచించారు. పడిపోవడం అనేది కథ ముగింపు కాదు. తిరిగి లేచి
నిలబడటం, మనకంటూ ఒక ప్రత్యేకమైన కథను రాసుకునేందుకు నిరంతరం ప్రయత్నించడమే జీవితం” అని పేర్కొన్నారు. స్వామి వివేకానంద చెప్పిన లేవండి,మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి” అనే మాటలనుగుర్తుచేస్తూవిద్యార్థులు తమ లక్ష్యాల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ప్రోత్సహించారు. పిల్లలను లక్ష్యాల దిశగా ముందుకు నడిపిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా, ప్రపంచం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, మీ మూలాలను ఎప్పటికీమర్చిపోవద్దు. ప్రపంచంలో వచ్చే మార్పులను స్వీకరించండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా చూసుకోండి” అని సూచించారు.సభను ఉద్దేశించి అరుణ్ కుమార్
మాట్లాడుతూ
తన పాఠశాల, కళాశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వివరించారు. గెలుపు కంటే పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని స్పష్టం చేశారు.గెలవడం అనేది అన్నింటికంటే ముఖ్యం కాదు. మీరు పోటీల్లో పాల్గొనడం ముఖ్యం. అందువల్ల మీలో ప్రతి ఒక్కరూ క్రీడల్లో మరింత చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను అని అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఉపాధ్యాయులు వారికి నిరంతరం స్ఫూర్తినివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులను క్రీడల్లో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నఉపాధ్యాయులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ
మీ సహకారం వల్లే
ఈ పిల్లలు క్రీడా మైదానానికి వస్తున్నారు అని అన్నారు. ఆయన మాటలు యువ క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. దీంతో వారు మరింత ఉత్సాహంతో మిగిలిన పోటీల్లో పాల్గొన్నారు.వరుసగా మూడో ఏడాది విజయనగర్ హౌస్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ముగింపు వేడుకలు, రిట్రీట్ కార్యక్రమంతో వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి.






Save or share this story as a newspaper-style Epaper Clip: