అభివృద్ధి పనులు సజావుగా సాగేందుకు ప్రజల సహకారం కూడా తప్పనిసరిగా ఉండాలి……. ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట నవంబర్ 27 :
అభివృద్ధి పనులు సజావుగా సాగేందుకు ప్రజల సహకారం కూడా తప్పనిసరిగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని రాణిగంజ్ లో గల రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ పనులను ఇటీవల ప్రారంభించగా, శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టనున్న రైల్వే విస్తరణ పనుల గురించి రైల్వే అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయకుండా మొదటగా ఒకవైపు పనులు ప్రారంభించి, మరోవైపు వాహనాలు వెళ్ళేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే, GHMC, పోలీసు, ట్రాఫిక్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతి, సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెరిగిన వాహనాల రద్దీ, దీర్ఘకాలికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి, ఫతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి విస్తరణ, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. తన కృషి ఫలితంగా రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి విస్తరణ, సనత్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం రైల్వే శాఖకు నిధులు చెల్లించినట్లు తెలిపారు. వివిధ కారణాలతో రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభించడంలో జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బ్రిడ్జి క్రింద ప్రస్తుతం 33 ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్డు ను 66 ఫీట్ లకు పెంచడం జరుగుతుందన్ని చెప్పారు. ఈ మార్గంలో రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ, రైల్వే బ్రిడ్జి క్రింద మాత్రం రోడ్డు ఇరుకుగా ఉండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారని, రైల్వే బ్రిడ్జి విస్తరణ పనులు పూర్తయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఒక వైపు విస్తరణ పనులు పూర్తవడానికి సుమారు 8 నెలలు, మరో వైపు పనులు పూర్తి కావడానికి మరో 6 నెలలు సమయం పడుతుందని అధికారులు తెలిపారని, ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. సనత్ నగర్ రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభమైనప్పటికీ, వివిధ రకాల నిర్మాణాలు అడ్డంకిగా ఉండటంతో తాత్కాలికంగా అధికారులు పనులు నిలిపివేసినట్లు చెప్పారు. ఫతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి విస్తరణ, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణానికి కూడా కెసిఆర్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ను మంజూరు చేయగా, నాటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శంఖుస్థాపన చేసినట్లు వివరించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు జరిగినప్పటికీ, ఫతే నగర్ ఫ్లై ఓవర్ విస్తరణ, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అండర్ పాస్ ల నిర్మాణం తన కల అని అన్నారు. ఎమ్మెల్యే వెంట సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగ తాయారు, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున్, CE వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎలెక్ట్రికల్ DE సురేష్, మహంకాళి ట్రాఫిక్ CI శోభన్, లా అండ్ ఆర్డర్ CI రవి కుమార్, వాటర్ వర్క్స్ GM శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు కె.కిషోర్ కుమార్, ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, గడ్డం శ్రీకాంత్ యాదవ్, సత్యనారాయణ, గణేష్, అబ్బాస్, జనార్దన్, రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *