‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న వేక్అప్ హ్యుమానిటీ బృందం.

హైదరాబాద్‌ నవంబర్ 27,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నగరంలో ప్రారంభించిన ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ కార్యక్రమం చివరి రోజు వేక్ అప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతను
మత్తు పదార్థాల
బారి నుంచి కాపాడుతూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ నడకలో సంస్థ సభ్యులు తమ సంఘీభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, నషా ముక్త్ భారత్ ఉద్యమాన్ని వివిధ రకాలుగా ముందుకు తీసుకెళ్తున్న తీరును అభినందించారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, ఎం పీ కొండా విశ్వేశర రెడ్డి తదితరులను కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన అంశాలపై చర్చించారు.
రాజకీయాలకు అతీతంగా విద్యాసంస్థలు, యువత భాగస్వామ్యంతో మత్తుపదార్థాల వ్యసనాన్ని అరికట్టేందుకు
తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేక్ అప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇండో-కెనడియన్ న్యాయవాది అడ్వకేట్ సయ్యద్ నూర్, ఉపాధ్యక్షుడు అడ్వకేట్ మహమ్మద్ ముదస్సిర్ జుహా, న్యాయవాదులు జి. లలిత్ కుమార్, వంశీ, టైగర్ బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *