తాళ్లూరు: మండలంలో పది పంచాయితీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీడీఓ, ఆర్డీఓ అజిత ఆధ్వర్యంలో పూర్తి చేసారు. మండలంలో లక్కవరం, దోసకాయలపాడు, బెల్లంకొండ వారి పాలెం, మన్నేపల్లి, మల్కాపురం, విఠలాపురం, కొర్రపాటి వారి పాలెం, శివరామపురం పంచాయితీలలో జరగనున్నాయి. ఆయా కేంద్రాలకు పీఓలు వంద మంది, ఎపీఓలు 104 మంది, ఓపీఓలు 34 మంది ని కేటాయించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్లను తీసుకుని సిబ్బంది తరలి వెళ్లారు. ఆర్డీఓ అజిత, ఎంఈఓ జి సుబ్బయ్య, జోనల్ అధికారులు ఎంఈఓ-2 నుధాకర్ రావు, ఎవో ప్రసాద రావులు పీఓలకు, ఎపీఓలకు కేటాయించిన కేంద్రాలకు రిపోర్టు తీసుకుని లేని వాటికి సిబ్బందిని నర్దు బాటు చేసారు. ఆయా కేంద్రాలలో బారికేట్లు, ఇతర అవనసరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ఆర్టీఓ వాకబు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శులు, విఆరాలు ఏర్పాట్లు చేస్తూ అధికారులకు నహకరిస్తున్నారు. తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: