మార్కాపురం : స్థానిక సంస్థలు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడుతుందని, రౌడీయిజంతో రాజ్యాలు ఏలాలంటే కుదరదని, తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామపంచాయతీ ఎన్నికలను వెంటనే నిలుపుదల చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా నేడు మార్కాపూర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.
చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో తుమ్మలచెరువు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లుగా ఆర్వో ప్రకటించి టిడిపి అభ్యర్థి ఏకాగ్రీవమై నట్లు ప్రకటించడం దుర్మార్గమైన చర్యని దీని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే తుమ్మలచెరువు గ్రామపంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని ఆయన కోరారు.
అలాగే కొంతమంది అధికార పార్టీ నాయకులకు చెందిన కుమారులు రౌడీలతో కలిసి వెళ్లి ముకుమ్మడిగా తుమ్మలచెరువు గ్రామం మీద దాడి చేసి భయభ్రాంతులకు గుచి చేయడం సమంజసం కాదని, ఇది ప్రజాస్వామ్యం అని రౌడీయిజ్యానికి తావు లేదని అని ఆయన అన్నారు, అలాగే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వారి ఇళ్ల కెళ్ళి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు.
అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కలిసి ఇలాంటి అక్రమాలకు అధికార పార్టీ పాల్పడే విధంగా సహకరిస్తున్నారని ఇది చాలా హేయమైన చర్య అని సైదా అన్నారు
ఇలాంటి అసమర్ధత విధానాల వల్ల పోలీస్ ప్రతిష్ట దెబ్బతింటుందని మార్కాపురం జిల్లా ఎస్పీ స్పందించి ఇలాంటి రౌడీ రాజకీయాలను అణిచివేయాలని సైదా కోరారు , తుమ్మలచెరువు గ్రామపంచాయతీ ఎన్నికల అధికారి (RO)ఉన్నటువంటి పోలిశెట్టి అల్లూరయ్యను వెంటనే ఉద్యోగ బాధ్యతల నుండి సస్పెండ్ చేయాలని ఇలాంటి అవినీతి అక్రమార్కులు వల్లే ఎన్నికల వ్యవస్థ అప్రతిష్ట పాలవుతుందని దీనిపై కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
అలాగే మార్కాపురం, పొదిలి మున్సిపల్, వైస్ చైర్మన్ అభ్యర్థలుగా మైనార్టీ వర్గాలు చెందిన వారిని నియమించాలని సైదా డిమాండ్ చేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్, తుమ్మలచెరువు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయని సర్పంచ్ అభ్యర్థులు ఇళ్ల దగ్గరకు వచ్చి నామినేషన్ ఉపసమరించుకోవాలనీ చెప్పి కోరడం, భయపెంచడo సమంజసం కాదని, ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని వారన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఇమ్రాన్, తర్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, పొదిలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముల్లా జిలాని, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: