దొనకొండ మండలంలోని బాదాపురం గ్రామంలో
గ్రామస్తులు ఐక్యతగా రామాలయం నిర్మించుకు న్నారు. రెండు రోజులు హోమం, పూజలు చేసి శని వారం విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేశారు. సీతా రాములు, లక్ష్మణుడు, జీవ ధ్వజ స్తంభం, గ్రామ దేవతల ప్రతిష్ఠ కార్యక్రమం బద్వేలుకు చెందిన ఓరగంటి సీతారామశాస్త్రి బృందం వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవ ధాన్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం చేశారు. జిల్లా చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసా దరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మండల మాజీ కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, కర్నాటి ప్రసన్నాంజనేయరెడ్డి, స్థానిక సర్పంచ్ కొంగలేటి గ్రేస్ రత్నకుమారి దేవానంద్, సర్పంచ్ లు, ఎంపీటీ సీలు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


