రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీ ల ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్నాయని చెప్పారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు. క్రిస్టియన్, ముస్లీం మైనారిటీ ల అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేసిందని వివరించారు. గ్రేవ్ యార్డ్ లు, మసీదులు, చర్చి ల అభివృద్ధి, మరమ్మతుల కోసం అధిక నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. పండుగలను కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నిరంతరం ప్రజాప మధ్య ఉంటూ సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటాననే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అభివృద్ధి ప్రదాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రకటించారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ ప్రతినిధులు ప్రశాంత్, జయరాజ్, సామెల్, దయాకర్, శ్యామ్ సన్, సుధీర్ కుమార్, ముస్లీం ప్రతినిధులు, ఖలీల్, ఫహీం, నోమాన్ అబ్బాస్, రజాక్, కరీం, అఖిల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు

