సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా మర్రి శశిధర్ రెడ్డి బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు.. నియోజకవర్గానికి చెందిన బిజెపి శ్రేణులు నామినేషన్ దాఖలు చేసే సికింద్రాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయం సమీపంలోని కోర్ట్ కాంప్లెక్స్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని మర్రి శశిధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు… మహంకాళి జిల్లా బిజెపి పరిశీలకులు, కర్ణాటక కు చెందిన బిజెపి ఎమ్మెల్యే విశ్వనాథ్, మహంకాళి జిల్లా బిజెపి అధ్యక్షులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, కార్పొరేటర్లు కేతినేని సరళ, చీర సుచిత్రలతో కలిసి వెళ్లి శశిధర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు . అనంతరం శశిధర్ రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అమ్మవారికి 151 కొబ్బరికాయలు కొట్టారు. ఈ నామినేషన్ ఘట్టానికి మొండ డివిజన్ కార్పొరేటర్ దీపిక, నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు..
