అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ….. క్షేత్ర స్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, తాళ్లూరు మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంతో సమన్వయంతో పనిచేస్తారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కూడ మంచి అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. పలు సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా తక్షణమే పనులు చేసి పంపాలని కోరారు. ఆయా గ్రామాలలో సభలు, సమావేశాలు నిర్వహించి సమయంలో సంబంధిత ప్రజా ప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలని కోరారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాలని కోరారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ… గత సమావేశాలలో ప్రస్తావించిన సమస్యలు పదే పదే ప్రస్తావించాల్సిన రావటం బాధకమని, మరలా సమావేశం నిర్వహించు సమయానికి గత సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు కృషి చెయ్యాలని కోరారు. మండల రెవిన్యూ సర్వేయర్, సచివాలయ సర్వేయర్లు అనుసంధానం లేకుండా పనిచేస్తున్నారని, మండల సర్వేయర్ సక్రమంగా పనిచేయటం లేదని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నారని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు కోరారు. సెక్రటరీలు గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. తాళ్లూరు వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ… ప్రజలను తమ కార్యాలయాలకు పదే పదే తిప్పించుకోకుండా సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యుత్, నీటి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైస్ ఎంపీపీ-2 మంచాల నాగ ప్రయాంక నాగార్జున రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేని వారికి అవగాహన కల్పించి ఉపయోగించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ఎంపీడీఓ కెపై కీర్తి మాట్లాడుతూ … అధికారులు ప్రజా ప్రతినిథులను సమన్వయం చేసుకుని ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఇది అధికారుల బాధ్యత అని అన్నారు. గత సమస్యలు పదే పదే రాకుండా పరిష్కరించి ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ భూ రీసర్వే జరుగుతుందని, ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. వాగులు, పచ్చిక బైళ్లు, వంకలు ఆక్రమించుకుంటే వాటికి ఎటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వరని చెప్పారు. తాళ్లూరు-2 ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ – ఎస్సీ కాలనీలో మరోక ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చెయ్యలేదని చెప్పారు. బికే పాడు ఎంపీటీసీ బాల కోటయ్య రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కోఆప్షన్ మెంబర్ కరిముల్లా మాట్లాడుతూ రమణాల వారి పాలెం, విఠలాపురంలో డీస్బోర్ సమస్యను పరిష్కరించాలని కోరారు. మల్కాపురం సర్పంచి వలి తమ గ్రామంలో ప్రజలకు అందించాల్సిన ఇంటి నివాస పట్టాల సమస్యను పరిష్కరించాలని కోరారు, మన్నేపల్లి సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. మరుగుదొడ్ల బిల్లులు గతంలో నిర్మించిన వారిని ఇవ్వాలని కోరాడు. బొద్దికూరపాడు సర్పంచి మండా శ్యామ్సన్ ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్యను సభ దృష్టికి తెచ్చారు. రామభద్రాపురం సర్పంచి వెంకటలక్ష్మి తమ గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కరించాలని, ట్యాంకుకు రావటం లేదని సభ దృష్టికి తెచ్చారు. నాగంబొట్లపాలెం సర్పంచి చిమటా సుబ్బారావు రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య తీర్చాలని కోరారు. అధికారులు తూర్పు గంగవరం పశువైద్యులు రాంబాబు, వ్యవసాయాధికారి ప్రసాదరావు, సీడీపీఓ సీహెచ్ భారతి, విద్యుత్, హౌసింగ్, ఆర్ డబ్ల్యుఎస్ ఎఈలు వీర బ్రహ్మం కోటి రెడ్డి, శ్రీనివాసరావులు, ఎపీఎం. దేవరాజ్, ఎపీఓ మురళి, తాళ్లూరు వైద్యాధికారి భాదర్ మస్తాన్ బి, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యురాలు మౌనిక, హోమియో వైద్యురాలు శిరీష, ఈఓఆర్డీ కెజీఎన్ రాజు తమ శాఖల పురోగతిని వివరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆనంతరం సభా అధ్యక్షులు అనుమతి మేరకు మండల బడ్జెడ్ పదును ప్రవేశ పెట్టారు.











