సనత్ నగర్ BRS MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 9 వ తేదీ గురువారం నామినేషన్ దాఖలు చేస్తారు. ఉదయం 9.00 గంటలకు వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద తన తల్లి లలితా బాయి ఆశీర్వాదం పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బైబిల్ హౌస్ సమీపంలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి 9.30 గంటలకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా సిటీ లైట్ హోటల్, బాటా, ప్యాట్నీ, హరిహర కళా భవన్ మీదుగా నార్త్ జోన్ GHMC జోనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి అభ్యర్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలను అందజేస్తారు.
