ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు వాతల రామిరెడ్డి ఇటీవల ప్రమాదానికి గురై అనారోగ్యం పాలు కావడంతో బుధవారం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రామిరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం సుబ్బారెడ్డి, ఎఎంసి డైరెక్టర్ దాసరి ఏలియా, భిక్షాలురెడ్డి, ఉల్లగల్లు సర్పంచ్ పిచ్చయ్య, జిల్లెలమూడి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
