తాళ్లూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిథులు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ ను గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసారు. పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా తాళ్లూరు, తూర్పు గంగవరం రోడ్ విషయంమై జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి చర్చించారు. నూతనంగా బాధ్యలు చేపట్టిన మన్నేపల్లి సొసైటీ చైర్మన్ కుమ్మిత జయరామిరెడ్డి తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్ నాగార్జున రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ వేర్ డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డి, దర్శి మండల నాయకుడు గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి, కొర్రపాటి వారి పాలెం జెఎసీ గ్రామ కన్వీనర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

