ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం చిత్త శుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు చాటి చెప్పాలని వక్తలు అన్నారు. తాళ్లూరు-2 సచివాలయం పరిధిలో గురువారం “వై నీడ్స్ ఏపీ జగన్ ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కెవై కీర్తి, ఎంఈఓ సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాదరావు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. సంక్షేమ పట్టికను ప్రదర్శించారు. అనంతరం కొర్రపాటి వారి పాలెంలో జెసీఎస్ కన్వినర్ కొర్రపాటి విష్ణు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాలలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, సొసైటీ చైర్మన్లు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయ రామి రెడ్డి, తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, రజానగరం, బెల్లంకొండ వారి పాలెం సర్పంచిలు షేక్ వలి, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, బ్రహ్మా రెడ్డి, ఎంఎల్.ఓ నాగ మల్లేశ్వర రెడ్డి, కెవి. పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



