ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామానికి చెందిన “తలుపుల నాయక్” ను బిజెపి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షులు దామోదర్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ బీజేపీ నాయకులను, కార్యకర్తను కలుపుకొని రాబోయే రోజుల్లో యువత సమస్యల మీద పోరాడుతానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. మరియు పార్టి బాధ్యతలను అందించిన యువ మోర్చా అధ్యక్షులు దామోదర్ చౌదరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ, మరియు జిల్లా నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
