యువతను నిర్వీర్యం చేస్తున్న ప్రాంతీయ పార్టీలు – జిల్లా బిజెపియువ మోర్చా అధ్యక్షులు పువ్వాడ దామోదర్.

రాష్ట్రంలో యువతను ఉద్యోగాలు లేకుండా నిర్వీర్యం చేస్తూ, ఉపాధి లేకుండా చేస్తున్నాయని యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడ దామోదర్, ముఖ్య అతిగా జిల్లా బిజెపి అధ్యక్షుడు పీవీ శివారెడ్డి పాల్గొన్నారు.. శుక్రవారం త్రోవగుంట విష్ణు ప్రియా కన్వెన్షన్ హాల్లో జరిగిన జిల్లా బిజెపియువ మోర్చా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పీవీ శివారెడ్డి పాల్గొని ప్రసంగించారు. సభకు యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్ అధ్యక్షత వహించారు
జగన్ జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసగించారని, రానున్న ఎన్నికల్లో యువత తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక ఉపాధి విధానాల వల్ల దేశం అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ యోగయ్య యాదవ్ మాట్లాడుతూ ….. ఈ కుటుంబ పాలన పార్టీలను ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని అన్నారు, బాపట్ల జిల్లా ఇంచార్జ్ పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ….. రానున్న ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలని, యువత దేశానికి వెన్నెముక అన్న వివేకానందుని మాటలు యువత ఆచరణలో చూపాలని కోరారు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్ మాట్లాడుతూ యువత ఓటు హక్కును సరిగా వినియోగించుకొని కీలక పాత్ర పోషించాలనిసూచించారు, యువతను చైతన్యపరిచే విధంగా యువమోర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా యువ మోర్చా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి రవి శంకర్, ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ యోగయ్య యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శివాజీ యాదవ్,యువ మోర్చా జోనల్ ఇంచార్జి జోనల్ ఇన్చార్జి అశోక్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జి జీవి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఏనుమల నాగేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *