చిరుధాన్యాల వలన కలిగే బహుళ ప్రయోజనాలపై తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ తృణ ధాన్యాల దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాళ్లూరు వ్యవసాయ కార్యాలయం వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన ఆహారంలో చిరుధాన్యాలు ఎంతో కీలకమైనవని అన్నారు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకొనుటకై ప్రజలను చైతన్య పరటమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఇప్పటికే 4062 మంది విద్యార్థులతో, 209 మంది టీచర్లకు, 239 మంది ఇతరులకు చిరు ధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించటం జరిగిందని వివరించారు.
