వైద్య సేవలు అభినందనీయం – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ -వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

దర్శి మండలం లో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో వైద్య సేవలుఅందించడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి నియోజకవర్గంలో జగ నన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో వైద్యులను శుక్రవారం సన్మానించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం దేశంలోనే సంచలనం సృష్టించింద న్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ వైద్యం అందించిన గోప్ప వ్యక్తిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని చెప్పారు. సీఎం పాలనను చూసి ఇతర రాష్ట్రాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.వైద్యులు కిరణ్మయి, యాతం సురేఖ, శ్రీనివా సులు, ప్రవీణ్, సక్రూనాయక్, బ్లెస్సీ తదితరులను సన్మానించారు.
ఎంపీపీ సుధా అచ్చయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ షకీలా అమీన్ బాషా, కౌన్సి లర్లు మేడం మోహన్ రెడ్డి, వీసీ రెడ్డి, తుళ్లూరి బాబూ రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముందుగా ఎమ్మెల్యే కార్యాలయంలో పలు సమస్యలపై నియోజక వర్గంలోని నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను కలిసి ఆయన దృష్టికి తీసువచ్చారు. పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *