ప్రజా సంక్షేమ ప్రధాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడి రుణం తీర్చుకోవాలని వక్తలు అన్నారు. తాళ్లూరు-2 సచివాలయం పరధిలోని కొర్రపాటి వారి పాలెంలో శనివారం “వై నీడ్స్ ఏపీ జగన్ | కార్యక్రమాన్ని నిర్వహించారు. కొర్రపాటి వారి పాలెంలో జెసీఎస్ కన్వినర్ కొర్రపాటి విష్ణు ఆధ్వర్యంలో గ్రామంలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, సొసైటీ చైర్మన్లు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయ రామి రెడ్డి, తాళ్లూరు, రాజానగరం, బెల్లంకొండ వారి పాలెం సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, షేక్ వలి, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎఎంసీ డైరెక్టర్ శరత్, మాజీఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, స్థానిక నాయకులు గొల్లపూడి పూర్ణ, మార్టిన్ లూథర్, పాల్గొన్నారు.



