తాళ్లూరు మండలం బోద్ధి కూరపాడులో రగ్బీ జిల్లా జట్టు ఎంపిక

తాళ్లూరు ప్రకాశం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్(18 ఏళ్ల వయసు లోపు) బాల బాలికల జట్ల ఎంపిక ఈ నెల 27వ తేదీన తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్ రవి ప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. రగ్బీ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 27వ తేదీఉదయం 10 గంటలకు వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్ కార్డ్ , నాలుగు పాస్ ఫొటోలతోహాజరు కావాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో భీమిలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి ఎస్ శ్రీకాంత్ గణేష్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *