విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగ బాలుర విద్యార్థుల వసతి గృహాంలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన తెలిపారు. ఒకటవ తరగతి నుండి 12వ తరగతి ఆపైన ప్రత్యేక విద్యాకోర్సులు చదువు విద్యార్థులు అర్హలని చెప్పారు. శారీరక అంగ వైకల్యం, పాక్షిక అంధత్వం, పాక్షిక వినికిడిలోపం కలిగి ప్రభుత్వ వైద్యశాల నుండి దృవీకరణ పత్రం పొందిన బాలురు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వసతి గృహంలో ఉచిత బోజనం, వసతి, ప్రతి నెల కాస్మోటిక్స్ అందజేత వంటి సదుపాయము ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం అవసరమైన వారికి ప్రత్యేక సహాయకుడి సౌలభ్యం కల్పించబడునని చెప్పారు. పూర్తి వివరాలకు కార్యాలయం ఫోన్ నంబర్ 0852-281310ను కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
