చెత్తను ఎక్కడ బడితే అక్కడ వేయకూడదని అలా వేస్తే అంటు వ్యాధులు ప్రభలు తాయని,చెత్త కుండీ లలో వేయాలని జీ హెచ్ ఎమ్ సీ బేగంపేట సర్కిల్ డిప్యూటి కమీషనర్ సమ్మయ్య ప్రజలకు పిలుపు నిచ్చారు.శుక్రవారం
బేగంపేట కమ్యూనిటీ హాలులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.బస్తీ లో చెత్త ను ఎక్కడ బడితే అక్కడ వేస్తున్నారని.దీంతో అది దుర్వాసన వస్తుందన్నారు.బస్తీ లోని పబ్లిక్ టాయిలెట్లు వద్ద,అమీర్ పేట ,కూకట్ పల్లి నాలాలో కూడా చెత్తను వేస్తున్నారని, టాన్స్ ఫారం వద్ద కూడా చెత్త కవర్లు వేస్తున్నారని,ఇలా వేయడం రోగాలను పెంచడం అవుతుందని,చెత్తను ఎక్కడ బడితే అక్కడ వేయకుండా బస్టీలోని అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని సమ్మయ్య కోరారు. సోమవారం నుంచి దీనిపై అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత కూడా పబ్లిక్ స్థలాల్లో చెత్త వేసిన వారికి రూ 1000లు జరిమానా విధిస్తామని జీ హెచ్ ఎమ్ సి బేగంపేట సర్కిల్ డిప్యూటి కమీషనర్ సమ్మయ్య తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో నసీర్ (అడ్డూ),ఆయూబ్,జమీర్, సమీ (ఆరీఫ్),వాహెడ్, నగేష్,ఆర్ పి ప్రశాంతి రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.


