పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగ భవాని ఆలయ సన్నిధిలో దేవ దాయ, ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం చండీ హోమం నిర్వహించారు. గుంటూరుకు చెందిన ప్రసిద్ధ అర్చకస్వాములు వంగర శ్రీకాంత్ శర్మ, నడింపల్లి వాసుదేవశర్మ ఆ ధ్వర్యంలో అర్చకస్వాముల మం త్రోచ్ఛర ణల మధ్య అత్యంత వైభ వంగా చండీ హోమాన్ని నిర్వహించారు. విశేష పూజలు, గణపతి పూజలు నిర్వహించారు.గణపతి పూజలు నిర్వహించారు. చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈ వో పి.కార్తిక్, ఆలయకమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, పూజారులు కామేశ్వరశర్మ, ప్రకాశ్ పంతులు, మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, నా గంబొట్లపాలెం సొసైటీ చైర్మన్ యల్లమందారెడ్డి, స్వామి డాక్టర్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొ న్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గురుబ్రహ్మం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కా ర్యక్రమం నిర్వహించారు.


