వాహన దారులు సరైన దిశలో మాత్రమే ప్రాయాణించాలని,అలాకాకుండా రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏ సీ పీ జీ.శంకర్ రాజు పిలుపు ఇచ్చారు.బుధవారం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ట్రాఫిక్ సిబ్బంది ,వారి కుటుంబాల సభ్యులకు రోడ్ ప్రమాదాలు నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వారికి హెల్మెట్ల పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ వాహనాలను నడుపుతున్న సమయం లో ద్విచక్ర వాహన దారులు అయితే తలకు హెల్మెట్ ధరించాలని అన్నారు అలాగే కార్లలో ప్రయాణిస్తున్న వారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు.హెల్మెట్ లేకుండా బైక్ నడిపి ప్రమాదానికి గురైతే జీవిత భీమా వర్తించడన్నారు.18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ లైసెన్సు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఐ సి ఐ సి ఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపనీ,ట్రాక్స్ ఎస్ సొసైటీ రోడ్ సేఫ్టీ వారి సహకారం తో ట్రాఫిక్ సిబ్బంది,వారి పిల్లలకు హెల్మెట్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం లో హీరో మోటార్స్ మేనేజర్ సాదిక్,శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరియు సిబ్బంధికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై అవగాహన కలుగ చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. వాహనం ముందు కూర్చున్న వ్యక్తి ప్రాణాలు ఎంత ముఖ్యమో వెనుక కూర్చున్న వ్యక్తి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అని తెలిపారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే జీవిత భీమా క్లెయిమ్ కాదు. హెల్మెట్ లేని ప్రయాణం నేరం ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,200 వరకు జరిమానా విధిస్తారు మరియు మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. వేగం థ్రిల్ ఇస్తుంది కానీ అది జీవితాన్ని చంపుతుంది. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగ లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పబ్లిక్ రోడ్లపై ఎవరూ వాహనం నడపకూడదు. అలా వాహనాలు నడిపినచో 5000 వరకు చలాన్, మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు, Trax S సొసైటీ రోడ్ సేఫ్టీ వారి సహకారంతో ట్రాఫిక్ సిబ్బంది మరియు వారి పిల్లలకు హెల్మెట్స్ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో హీరో మోటార్ మేనేజర్ సాదిక్ & శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.



