మేధోశక్తి పెంపొందించడం అభినందనీయం – సంఘ సేవకుడు జీవీ రత్నం -వేసవి విజ్ఞాన శిబిరాలు ముగింపు -ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

విద్యార్థులకు మేధోశక్తి పెంపొందించడం అభినందనీయమని సంఘ సేవకులు జీవీ రత్నం అన్నారు. దర్శి లోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు ముగింపు కార్యక్రమానికి జీవీరత్నం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సంద ర్భంగా అతిథులను దుశ్శాలువాలు, పూలమాల లతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జీవీ రత్నం మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్ నిర్మాతలన్నారు. వేసవి సెలవుల్లో చెడు తిరుగుళ్లు లేకుండా విజ్ఞాన శిబిరాలకు రావడంతో విద్యార్థులు చైతన్య వంతులవుతారని చెప్పారు.
యూటీఎఫ్ సీనియర్ నాయకులు సహజకవి అట్లూరి రామారావు మ్లాడుతూ విద్య ఎక్కువగా స్త్రీలకు అవసరమన్నారు. అప్పుడే సమాజంలో గుర్తింప బడుతారని చెప్పారు. అట్లూరి సుస్మ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహు మతుల ప్రదానం చేశారు. పలువురిని సన్మానించారు . శ్రీనివాస్, పి.గోపి,
నాగార్జునరెడ్డి, కోటేశ్వరరావు, కోటయ్య, వి. వి.సుబ్బయ్య, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *