రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు,  సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు,  సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా  పిలుపునిచ్చారు. ఈ దిశగా స్వర్ణాంధ్ర -2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో పాల్గొనాలని ఆమె సూచించారు. విధానాల రూపకల్పనలో ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. https://swarnandhra.ap.gov.in/Suggestions అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే  ఒక అప్లికేషన్ వస్తుందని, దీనిలో పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా సర్వేలో పాల్గొన్న వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన ఒక ప్రశంసా పత్రాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *