భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కంటోన్మెంట్ వార్డు 2 రసూల్ పుర లోని ఇందిరమ్మ విగ్రహనికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రేగణేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు ఇందిరా గాంధీ ఆని కొనియాడారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరా గాంధీ ఎంతగానో కృషి చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్వర్గీయ ఇందిరాగాంధీ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నరేష్,శాంసన్ రాజు,శ్రీహరి, సదా నంద్ తది తరులు పాల్గొన్నారు.

