డాక్టర్ ఎన్ .టి. ఆర్ వి.ఎస్. టి జిల్లా కోఆర్డినేటర్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె. సురేష్ కుమార్ తెలిపారు. ఎంబి బిఎస్ అర్హత కలిగి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ఐదు సంవత్సరములు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. ఎటువంటి చార్జెస్ పెండింగ్ ఉండకుండా ఉండాలని, 45 సంవత్సరముల కంటె తక్కువ వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థి డాక్టర్ ఎన్టీఆర్ వి. ఎస్. టి జిల్లా కోఆర్డినేటర్ గా, ఫారిన్ సర్వీసెస్ గా పనిచెయ్యాలని తెలిపారు. నవంబర్ 7 లోపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
ఎన్టీఆర్ వి.ఎస్.టి జిల్లా కోఆర్డినేటర్ కు దరఖాస్తులు ఆహ్వానం
30
Oct