జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి సింగిల్ విండో ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో బుధవారం జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను పారిశ్రామికరంగంలో రాష్ట్రంలో ముందువరుసలో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ విండో పధకంలో జిల్లాలో 2023 నవంబర్ మాసం నుండి 2024 ఈ మాసం వరకు పరిశ్రమ ఏర్పాటుకు 2939 దరఖాస్తులు అందగా వాటిలో 2924 దరఖాస్తులు ఆమోదించడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు లేని ఒక దరఖాస్తును తిప్పివేయడం జరిగిందని, పెండింగ్లో 14దరఖాస్తులు ఉ ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ లో వున్న 14 ధరఖాస్తుల్లో ఏపీపీసీబీ ఈఈ వద్ద 10 దరఖాస్తులు, ఎపిఐఐసి వద్ద ఒక దరఖాస్తు, ఫ్యాక్టరీ శాఖకు సంబంధించి ఒకటి, గ్రౌండ్ వాటర్ కు సంబంధించి ఒకటి, లీగల్ మెట్రాలాజి వద్ద ఒకటి చొప్పున ఉన్నాయని, పెండింగ్ ఉన్న దరఖాస్తులను గడువు లోపు పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ప్రోత్సాహాకాలకు సంబంధించి 399 దరఖాస్తులు రాగా 384 దరఖాస్తులు సిఫారస్సు చేస్తూ 6.95 కోట్ల రూపాయలు ప్రోత్సకాలు అందించేలా సిఫారస్సు చేస్తూ, 15 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజిపి లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పధకం కింద 379 దరఖాస్తులు రాగా 263 దరఖాస్తులు సంబంధిత బ్యాంకులకు పంపగా, 6.03 కోట్ల రూపాయల మార్జిన్ మని తో 181 ధరకాస్తులు బ్యాంకులు మంజూరు చేయడం జరిగిందని, పెండింగ్ లో వున్న దరఖాస్తులను గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎల్.డి.ఎం ను ఆదేశించారు. పి.ఎం విశ్వకర్మ యోజన ప్రోగ్రాం కింద ఇప్పటివరకు జిల్లాలో 59,277 దరఖాస్తులు రాగా స్టేజ్ 1 లో 54,038 దరఖాస్తులు క్లియర్ చేయడం జరిగిందని, స్టేజ్ 2 లో 42,737 దరఖాస్తులు పెండింగ్ లో వున్నాయని, పెండింగ్ లో వున్న దరఖాస్తులను నిర్ణీత గడువులోపు క్లియర్ చేయాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగ పురస్కరించుకొని బాణాసంచా తయారీ కేంద్రాల వద్ద, నిల్వ కేంద్రాల వద్ద, బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ శ్రీనివాస రావు, , డీఆర్డీఏ పీడీ వసుంధర, ఉప రవాణా కమీషనర్ సుశీల, కాలుష్య నియంత్రణమండలి ఈఈ రాఘవ రెడ్డి, ఎల్డిఎం రమేష్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ మదన్ మోహన్, ఎపి ఎస్ ఎఫ్ సి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్.ఈ వెంకటేశ్వర్లు, గ్రౌండ్ వాటర్ డిడి విద్యా సాగర్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

