రిసెప్షన్ సెంటర్లు మరియు స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి రాజబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన రాజు లు కలసి పరిశీలించారు . గురువారం సాయంత్రం స్థానిక Qis కాలేజీ మరియు Rise కాలేజీలలో పర్యటించి రిసెప్షన్ సెంటర్లు మరియు స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ quis కాలేజీలో దర్శి, అద్దంకి మరియు ఒంగోలు నియోజకవర్గాలకు సంబంధించి 12 మండలాలు, Rise కాలేజీలో కొండేపి కందుకూరు ఎస్ఎన్ పాడు నియోజకవర్గాలకు సంబంధించి 12 మండలాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల బాక్సులను భద్రపరచునున్నారు. ఈ కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ బ్యాలెట్ బాక్స్ లను ఇతర డ్యామేజ్ జరగకుండా ఆయా స్ట్రాంగ్ రూములలో చేర్చే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. బందోబస్తును సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా క్రమ పద్ధతిలో బస్సులు గమ్యస్థానం చేరే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత సిబ్బందికి సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద ప్రతి ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: