“మురసు” తుఫాన్ నేపథ్యంలో రావినూతల వద్ద 33 కేవీ విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి -విద్యుత్ సిబ్బందికి అండగా నిలిచిన మహిళా కూలీలు -వారి సహకారాన్ని అభినందించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్

“మురసు” తుఫాన్ సృష్టించిన సవాళ్లను అధిగమిస్తూ, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు APCPDCL అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో APCPDCL డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి రావినూతల వద్ద 33 కేవీ మేదరమెట్ల–రావినూతల విద్యుత్ ఫీడర్ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంగా పనుల ప్రదేశంలో ఉండి పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాల ఏర్పాటు, విద్యుత్ లైన్ మరమ్మతు పనులను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు తగిన సూచనలు అందించారు.
ఈ పునరుద్ధరణ పనుల్లో మానవత్వం, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా ఓ ప్రత్యేక సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సిబ్బంది మరమ్మతు పనులు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలోని పొలంలో పనిచేస్తున్న మహిళా కూలీలు విద్యుత్ సిబ్బంది కష్టాన్ని గమనించారు. తాము కూడా తమ వంతు సహకారం అందిస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సిబ్బందికి సహాయం అందించారు.
విద్యుత్ సిబ్బందికి మహిళా కూలీలు అందించిన ఈ సహకారం, సామాజిక బాధ్యత పట్ల వారు చూపిన చొరవను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఆపద సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. విద్యుత్ పనులన్నీ తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *