ప్రపంచ ఆర్థికవేత్తలో అగ్రగణ్యుడు,ప్రపంచ నోబెల్ అవార్డు గ్రహీత,భారతదేశ ఆణిముత్యం, భారత ప్రభుత్వ అత్యున్నతమైన భారతరత్న అవార్డు గ్రహీత,సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య కుమార్ సేన్94 జన్మది నం ఘనంగా నిర్వహణ

దర్శి : స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో, దర్శి సాంస్కృతిక, సాహిత్య వేదిక ఆధ్వర్యంలో.., ప్రపంచ ఆర్థికవేత్తలో అగ్రగణ్యుడు,ప్రపంచ నోబెల్ అవార్డు గ్రహీత, భారతదేశ ఆణిముత్యం, భారత ప్రభుత్వ అత్యున్నతమైన భారతరత్న అవార్డు గ్రహీత,సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య కుమార్ సేన్ 94 జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి దరిశి సాంస్కృతిక,సాహిత్య వేదిక ప్రతినిధి ,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు . ముఖ్య అతిధి డీటి టి దేవప్రసాద్ పాల్గొన్నారు. అతిధులుగా రీ సర్వే డీటి పరిటాల శ్రీనివాసులు, సీనియర్ సహాయకులు శ్రీనివాస ప్రసాదశర్మ, జూనియర్ సహాయకులు రామకృష్ణ వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి డీటి దేవప్రసాద్ మాట్లాడుతూ .. భారతీయ తత్వవేత్త,మానవ అభివృద్ది సిద్ధాంతం, కరువు,పేదరికానికి కారణాలు, ఉదావాద రాజకీయలలో చేసిన విశేషకృషికి 1998లో ప్రపంచ అత్యున్నతమైన, ప్రఖ్యాతిఘఢించినవారికి అరుదుగా ఇచ్చే ప్రపంచ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డును సొంతంచేసికొవడమే గాకుండా,1999లో భారతదేశ ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును సొంతంచేసికొన్న మహోన్నతమైన వ్యక్తని ఆయన సేవలను కొనియాడారు.94 జన్మదినం జరుపుకుంటున్న అమర్త్య సేన్ ప్రపంచానికే ఆదర్శంగా వుంటూ, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారని, ఆ యన మన అం దరికి మంచి మార్గదర్శకులని తెలిపారు .అమర్త్ సేన్ సేవలను వక్తలందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది,అనేక ప్రజాసంఘాల వారు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *