తాళ్లూరు: మురును తుఫాన్ నేపధ్యంలో మండలంలో వర్షం తక్కువ గాలులు వేగవంతంగా వీసాయి. దీంతో కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న, పలు చోట్ల బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. వరుసగా రెండు తుఫాన్లు వచ్చినా ఆశించిన మేర వర్షపాతం నమోదు కాక, కేవలం 8.9 మి.మీలు మాత్రమే నమోదు కావటం రైతాంగాన్ని నిరుత్సానికి గురిచేసింది. తీవ్ర వేగంగా వీచిన గాలులతో వికే ఉన్నత పాఠశాల వద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద, బ్రహ్మాంగారి గుడి వద్దతో పాటు పలు గ్రామాలలో చెట్లు విరిగి పడిపోవటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినది. సోమవారం రాత్రి నుండే విద్యుత్ లేక పోవటంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఎఈ రామక్రిష్ణా రెడ్డి , జె. ఎల్. ఎం ఫ్రాన్సిస్ , సిబ్బందితో యుద్ధ న విద్యుత్ ,మార్గాలను పలుమార్లు పరిశీలించి చెట్లను తొలగించి ఎట్టకేలకు తాళ్లూరు, కొత్త పాలెంలకు విద్యుత్ ను పునరుద్దరించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు వచ్చిన అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: