మొరుగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి… సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట నవంబర్ 3 జె ఎస్ డి ఎం న్యూస్ ) :
మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని మెక్లడ్గూడ లో మురుగునీరు ఓవర్ ఫ్లో అయ్యి రోడ్డుపై ప్రవహిస్తుందని ఇటీవల స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి మురుగునీరు పొంగి ప్రవహిస్తున్న ప్రాంతంలో పర్యటించారు. రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటం వలన నడవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్థానికులు వివరించారు. త్రాగునీరు కూడా కలుషితం అవుతున్నాయని విన్నవించారు. ఈ సమస్యకు గల కారణాలను వాటర్ వర్క్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం గుండా వెళ్తున్న డ్రైనేజీ పైప్ లైన్ పగిలి నాలా లోని మురుగునీరు పైప్ లైన్ లోకి చేరి పొంగి ప్రవహిస్తుందని వాటర్ వర్క్స్ GM వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా నూతన పైప్ లైన్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మురుగునీరు రోడ్డుపైకి రాకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లో అత్తిలి మల్లికార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, వాటర్ వర్క్స్ GM వెంకట్ రెడ్డి, DGM ఆశిష్, GHMC AE చంద్రశేఖర్, ఎలెక్ట్రికల్ AE శివరామకృష్ణ, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి. శ్రీహరి, సతీష్, గణేష్, సంజయ్, బస్తీ వాసులు స్వరూప, శ్రీనివాస్, సుభాష్, సురేష్, మహేష్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *