తాళ్లూరు : మండలంలో జెడ్పీటీనీ ఎన్నిక నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేసారు. ఆర్ ఓ దేవ సహాయం, ఎఈఆర్ ఓ , ఎంపీడీఓ అజిత, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎంఈఓలు జి సుబ్బయ్య, సుధాకర్ రావు, వ్యవసాయాధికారి ప్రసాద్ రావుల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బంది సామగ్రిని అందజేసారు. మండలంలో 46 పోలింగ్ బూత్‌లలో 37,971 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ బూత్‌లను రెండు జోన్లుగా ఐదు రూట్లుగా విభజించి ఆయా రూట్లను ప్రత్యేక పర్యవేక్షణలో ఎస్పై మల్లిఖార్జున రావు బస్సులను పంపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: