నవంబర్ 05వ తేదీన జరగనున్న MPTC,ZPTC ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని బుధవారం జిల్లా ఎస్పీ తెలియజేశారు.
జిల్లాలో 25 జడ్పీటీసీ, 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 714 పోలింగ్ లొకేషన్లలో 1,260 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 83 అత్యంత సమస్యాత్మక, 149 సమస్యాత్మక, 482 సాధారణ పోలింగ్ లొకేషన్లుగా గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 2,391 మంది పోలీసు మరియు ఇతర శాఖల సిబ్బందిని నియమించారు. అదనంగా 34 స్ట్రైకింగ్ ఫోర్స్, ASP -2,DSP-6,CI -26 లు స్ట్రైకింగ్ ఫోర్స్, 25 సీఐల ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేశారు. అలాగే 141 రూట్ మొబైల్ వాహనాలను ఒంగోలు (53), దర్శి (57), కందుకూరు (31) ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు.
ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా 739 మంది చెడు నడతగల వ్యక్తుల(రౌడీషీటర్ల)పై బైండోవర్, గొడవలు, అల్లర్లకు చేస్తారనే ఉద్దేశ్యంతో ముందస్తుగా 974 మందిని బైండ్ ఓవర్ చేయటం జరిగింది.
ఎన్నికల నియమాలను ఉల్లంఘించి 23 కేసులు,అక్రమ మద్యం స్వాధీనానికి సంబంధించి 48 కేసుల్లో 187.37 లీటర్ల మద్యం, రూ.2,80,300 నగదును 13 కేసుల్లో స్వాధీనం చేసుకున్నారు.
డిస్ట్రిబ్యూషను సెంటరు నుండి పోలింగు మెటీరియల్ తీసుకొని వెళ్ళే దగ్గర నుండి పోలింగు ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా స్ట్రాంగ్ రూంలకు తరలించే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద పక్కా ప్రణాళికతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు.
పోలింగ్ సెంటర్ నిర్ణీత మార్గాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షించేందుకు మరియు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి శాంతిభద్రతలను అదుపులోకి తీసుకునేందుకు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
డ్రోన్స్ తో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పటు చేసి తగిన భద్రతను కూడా ఏర్పాటు చేయడమైంది.
ఈ ఫోర్స్ మొత్తం సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది.
ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎన్నికల సమయంలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పకట్భంది ఏర్పాట్లు చేసేమని, అలాగే ఏవైనా సంఘటనలు జరిగే అవకాశమున్నా జరుగుచున్నట్లు తెలిసిన వెంటనే డయల్ –100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: