సనత్ నగర్ నియోజకవర్గంలో మురికి నీటి సమస్యపై జలమండలి MD అశోక్ రెడ్డి ని కలిసిన మర్రి శశిధర్ రెడ్డి

సనత్ నగర్ నవంబర్ 4,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) : నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న మురికి నీటి సమస్యలపై మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయంలో MD అశోక్ రెడ్డి ని కలిశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి MD కి వినతిపత్రం అందజేసి, పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు..

  1. రాంగోపాల్ పేట్ డివిజన్ – ఆవులమంద వివేకానంద స్ట్రీట్:
    గత కొన్ని నెలలుగా అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలి.
  2. రంగ్రేజీ బజార్:
    పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులు పూర్తి చేయకుండానే రోడ్డు పనులు చేయడం వల్ల మళ్లీ మళ్లీ డ్రైనేజీ లీకేజీ సమస్య వస్తోంది.
  3. మెక్ లాన్ గూడ్:
    ప్రతిరోజూ డ్రైనేజీ లీకేజీలు ఏర్పడి మురికి నీరు రోడ్లపైకి వస్తోంది. అదే ప్రాంతంలో నల్లాల్లో కలుషిత నీటి సరఫరా సమస్య కూడా ఉంది.
  4. సికింద్రాబాద్ కంటోన్మెంట్:
    కంటోన్మెంట్ ప్రాంత మురికి నీటిని క్లాసిగూడ నాలాకు బదులుగా పికెట్ నాలాలో కలపాలని కోరారు. ఈ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని MD ని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మహంకాళి – సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ , రాంగోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షులు సందీప్ వర్మ , ఇతర బీజేపీ నాయకులు వి. దయానంద రావు, శ్రీనివాస్ యాదవ్, కిరణ్, బి. వికాస్, కె. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *