ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఎంపిటిసి, జెడ్పిటిసి పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ప్రకాశం భవనం నుంచి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.వి.ఎన్. చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు మరియు పోలింగ్ సిబ్బంది పనితీరును వారు పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసామన్నారు. కంట్రోల్ రూమ్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి సమస్య తలెత్తినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: