తాళ్లూరు : మండలంలో జెడ్పీటీసీ ఎన్నికకు నిర్వహించిన పోలింగ్ ఏక పక్షంగా జరిగింది. దీంతో 67.26శాతం నమోదు అయినది . ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులు ఓటర్లకు ఎటువంటి పారితోషకం ఇవ్వక పోవటంతో ఓటింగ్లో పాల్గొనేందుకు ఓటరు అనాసక్తి చూపారు. అదే ఇదే తడువుగా అధికార పార్టీకి చెందిన బయటి వ్యక్తులు వైసీపీ ఎక్కువగా ఆదరణ కలిగిన గ్రామాలలో బూత్లలోని వైసీపీ ఏజెంట్లను బయటకు పంపి వారి ఓట్లను వేసుకున్నారు. దీంతో లక్కవరం, మాధవరం, శివరామపురం, కొర్రపాటి వారి పాలెంలలో ఎజెంట్లు, ఓటర్లు కొంత సేపు ఆందోళన చేసారు. రజానగరంలో రిగ్గింగ్కు వచ్చిన టిడిపి శ్రేణులను గ్రామస్తులు అడ్డుకోగా ఏమి చెయ్యలేక వారు అక్కడ నుండి వెళ్లి పోయారు. బొద్దికూరపాడులో రిసైక్లింగ్ ఓట్లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన పలు గ్రామాలలో అధికార, ప్రతి పక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుకొని వారికి సంబంధించిన ఓట్లు వారు వేనుకున్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో మాత్రం ప్రశాంతంగా ఓటర్ల ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవటానికి సహకరించిన టిడిపి నాయకులకు ధన్యవాదాలు చెప్పారు .




Save or share this story as a newspaper-style Epaper Clip: