ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సంతమాగులూరు మండలం ఏల్చూరులోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్, సంతమాగులూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బల్లికురవ మండలం వైదన, కొప్పెరపాడు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, రేణంగివరంలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్, మద్దిపాడు మండలం నేలటూరివారిపాలెం, సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెం, పెద్దకొత్తపల్లి, ఎన్.జి.పాడు మండలంలోని అమ్మనబ్రోలులోని ఎంపీపీ, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమపద్ధతిలో ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పోలింగ్ నిర్వహణ తీరును, పోలీస్ బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు, భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా అమలు చేస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, గొడవలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ట్యాబ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంకు బాటిళ్లు, వాటర్ బాటిళ్లను అనుమతించకుండా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇతరులు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, సమయస్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్), పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నాయని, గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటూ, ఓటర్లు, ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నామని తెలిపారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఓటర్లుకు సూచనలు అందిస్తున్నామని వివరించారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పకట్భంది ఏర్పాట్లు చేసేమని, అలాగే ఏవైనా సంఘటనలు జరిగే అవకాశమున్నా జరుగుచున్నట్లు తెలిసిన వెంటనే డయల్ –100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, సంతమాగులూరు సీఐ శేషగిరి రావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సైలు, జిల్లా ఎస్పీ వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ దేవ ప్రభాకర్, ఎస్ఐలు మరియు సిబ్బంది ఉన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: