పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్నను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు, కొత్త పాలెం లలో మంగళవారం మొక్కజొన్న సాగుపై రైతులకు సామూహిక ప్రదర్శన క్షేత్రము నిర్వహించి, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు కు సాగుకు బదులు ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యా మొక్కజొన్న సాగు చేసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని కోరారు. సాగుపై అవగాహన కల్పించారు. విఏఏ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

