అంగన్వాడీ కార్యకర్త, ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

తాళ్లూరు మండలంలో పలు గ్రామాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త. ఆయా ల పోష్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ సీహెచ్ భారతి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టు తురకపాలెం-1 (ఒసీ జనరల్) ఖాళీగా ఉన్నట్లు, ఆయా పోస్టులు రామభద్రాపురం (ఒసీ జనరల్), తాళ్లూరు- (ఎస్సీ), తూర్పుగంగవరం -1 (ఒసీ జనరల్) కేంద్రాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాలకు కేటాయించిన రోస్టర్ ప్రకారం మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దర్శి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులను ఈనెల 23 వరకు కార్యాలయం పనివేళల్లో స్వీకరించబడునని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *