పంటలను పండిచటంతో పాటు వాటి విలువల పెంపుపై తగిన సూచనలు పాటిస్తే పంటలకు మంచి గిట్టుబాటు ధరలు వస్తాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. పంట ఉత్పుత్తులపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
సజ్జలు ముడి సరకు కేవలం రూ.2400 మాత్రమే అమ్ముడుపోతుందని అదే సజ్జ ఉత్పత్తులుగా మార్చుకున్నట్లయితే మంచి ఉత్పాదక ధర వస్తుందని అన్నారు. వివిధ రకాల ఉత్పత్తులను మహిళలకు అందజేసారు. ఎపీఎం ధన రాజ్ తదితరులు పాల్గొన్నారు.
