పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లంపల్లి పొగాకు బోర్డు సూపరిండెంట్ కె రామక్రిష్ణ అన్నారు. కొర్ర పాటి వారి పాలెంలో వెల్లంపల్లి పొగాకు బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో బాగంగా కెవీ పాలెం కెనాల్పై మొక్కలు నాటారు. అడవి మొక్కల పెంపకంపై ఉపయోగాలపై అవగాహన కల్పించారు. రైతులు కూడ తమ గట్లపై ఇతర ప్రాంతాలలో విరివిగా మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ హర్ష, ఎస్ఏ లు ఆర్ నవీన్ నాయక్, పవన్, బ్యారన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
