సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహములకు క్రీడ సామాగ్రి మరియు ట్రంకు బాక్స్ ల పంపిణి – ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు (డిప్యూటీ డైరెక్టర్) యన్.లక్ష్మా నాయక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ వారి అధ్వర్యంలో  ప్రకాశం జిల్లాలో 7 సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయముల పరిధిలో మొత్తం 75 వసతి   వసతి గృహములలో విద్యనభ్యసించుచున్న విద్యార్ధిని/ విద్యార్ధులకు క్రీడలలో మంచి ప్రావీణ్యం మరియు ప్రోత్సాహం ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో   క్రీడ సామాగ్రిని పంపిణి చేయటం జరిగినదని ప్రకాశం జిల్లా  సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు (డిప్యూటీ డైరెక్టర్) యన్.లక్ష్మా నాయక్ తెలిపారు.
. ప్రతి వసతి గృహమునకు
టెన్నీ కాయిట్ రింగ్స్ -10
చెస్ బోర్డ్స్ -5
కారోమ్ బోర్డ్ -2
షటిల్ కాక్ (6 pcs per Barrel)- 4
షటిల్ బాట్ -4
షటిల్ నెట్ -2
స్కిప్పింగ్ రోప్( అమ్మాయిలకు మాత్రమే) -1
వాలి బాల్-2
వాలి బాల్ నెట్ -1
డిస్కస్ త్రో పి.వి.సి విత్ రింగ్ 1 KG-1
జావెలిన్ బెంబూ -1
షాట్ పుట్ బాల్ – 1
చొప్పున మొత్తం ప్రకాశం జిల్లా లోని 75 వసతి గృహములకు గాను
టెన్నీ కాయిట్ రింగ్స్ -750 చెస్ బోర్డ్స్ -375
కారోమ్ బోర్డ్ -150
షటిల్ కాక్ (6 pcs per Barrel)- 300
షటిల్ బాట్ -300
షటిల్ నెట్ -150
స్కిప్పింగ్ రోప్( అమ్మాయిలకు మాత్రమే)-22
వాలి బాల్ -150
వాలి బాల్ నెట్ -75
డిస్కస్ త్రో పి.వి.సి విత్ రింగ్ 1 KG -75
జావెలిన్ బెంబూ -75
షాట్ పుట్ బాల్ – 75 చొప్పున క్రీడ సామాగ్రి మరియు 1286  ట్రంకు బాక్స్ లను సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, అమరావతి వారు 7 సహాయ సంక్షేమాధికారి కార్యాలయములకు పంపిణి చేయటం జరిగినది. ఈ సందర్బంగా జిల్లాలోని జిల్లా లోని  వసతి గృహములకు క్రీడ సామాగ్రి మరియు ట్రంకు బాక్స్ ను పంపిణి చేయటం జరిగినదని మరియు వసతి గృహములలోని  ప్రతి విద్యార్ధి క్రీడలలో ముందంజ సాదించేవిధముగా వారిని ప్రోత్సహించాలని మరియు వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ జాగ్రత్తగా పాటించాలని ప్రతి విద్యార్దిని తమ సొంత పిల్లల లాగా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రకాశం జిల్లా  సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు (డిప్యూటీ డైరెక్టర్) *యన్.లక్ష్మా నాయక్* జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమాధికారులను మరియు వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *