మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ దామోదర్ తెలిపారు. బుధవారం దోర్నాల్ లోని మల్లికార్జున్ నగర్ వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బంది, హైవే పేట్రోలింగ్ వాహనాలు, టోయింగ్ వెహికల్స్, మెకానిక్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అన్నదాన పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్
పాల్గొని భక్తులకు అన్నదానం చేసి ప్రారంభించారు. శివరాత్రి సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
భద్రతా చర్యలు & ట్రాఫిక్ నియంత్రణ చర్యల గురించి వివరించారు అందులో పలు సూచనలు ఇలా ఉన్నాయి…..
➡️ ఘాట్ రోడ్డు ప్రయాణాలకు నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే అనుమతించాలి.
➡️ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించరాదు.
➡️ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయబడింది.
➡️ రద్దీ సమయాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు.
➡️ భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి, వాటికి నిర్దిష్ట సమయాలు కేటాయించబడతాయి.
➡️ ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రయాణికులకు సూచనలు:
👉 ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
👉 ఘాట్ రోడ్డు ప్రయాణం సందర్భంగా అతి వేగాన్ని, నిర్లక్ష్యాన్ని పూర్తిగా నివారించాలి.
👉 అనవసరంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదు.
👉ఘాట్ రోడ్డులో నైపుణ్యం కలిగిన డ్రైవర్లను వెంట తీసుకుని రావాలి.
👉కండిషన్ బాగా ఉన్న వాహనాలు మాత్రమే ఉపయోగించాలి.
👉 అధికారుల సూచనలను గౌరవించి, సహకారం అందించాలి.
ప్రయాణికులకు ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని, ట్రాఫిక్ నియంత్రణ కోసం సంబంధిత అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని, పండుగను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్ గారు తెలిపారు.
జిల్లా ఎస్పీ గారి వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, మార్కాపురం డిఎస్పి నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, వైపాలెం సీఐ ప్రభాకర్ రావు,మార్కాపురం సిఐ సుబ్బారావు, దోర్నాల ఎస్సై మహేష్, రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు, మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది ఉన్నారు.








