భూములో పోషకాల స్థాయిని బట్టి ఎరువులు వాడుకోవాలని దర్శి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎడీఏ) బాలాజీ నాయక్ అన్నారు. లక్కవరంలో శుక్రవారం భూసార పరీక్షలు చేయించుకున్న రైతులకు భూసార పరీక్షా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎడీఏ మాట్లాడుతూ భూమి సజీవంగా ఉండాలంటే మంచి పోషకాలతో కూడిన పశువులు ఎరువు, పచ్చి రొట్ట పంటలను సాగు చెయ్యాలని సూచించారు. రైతులకు సంబంధించిన మెట్ట పోలాలలో 20 ఎకరాలకు ఒక నమూనా, మాగాణిలో పది ఎకరాలకు ఒక నమూనా చొప్పున సేకరించి భూ సార పరీక్షలు నిర్వహించినట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. విఏఏ వీరాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
