డెంగ్యూ జ్వరంపై అవగాహనతో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి
చెయ్యాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవంను పురష్కరించుకుని శుక్రవారం తూర్పుగంగవరంలో పీహెచ్సీ సిబ్బందితో కలసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. డెంగ్యూ వ్యాధి రావటానికి గల కారణాలు, వస్తే ఆ వ్యాధి లక్షణాలు, నిర్మూలన, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ఎన్ రమణమ్మ. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

