టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ తూము లక్ష్మిరెడ్డి, రమణమ్మ కుమారుడు సుబ్బా రెడ్డి, వెంకట సావిత్రిల వివాహా వేడుకలో దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి లక్ష్మి రెడ్డి దంపతులు, బంధు మిత్రులు, టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, శాగం కొండా రెడ్డి, మానం రమేష్, మేడగం వెంకటేశ్వర రెడ్డి, బొడ్డు హనుమా రెడ్డి, ఆవుల ఆదినారాయణ, చందన, కైపు రామ కోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, తూము శివ నాగి రెడ్డి, సమర, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని లక్ష్మి రెడ్డి దంపతులు, మహిళలు చీరే సారే పెట్టి ఘనంగా సన్మానించారు.


