ఒంటరి వృద్ధురాలి నగల దోపిడి కేసులో నిందులు అరెస్ట్ – ఆర్ధిక ఇబ్బందులతో దొంగతనానికి పాల్పడిన దంపతులు – రూ.6.40 లక్షల సొత్తు స్వాధీనం – చాక చక్యంగా కేసును ఛేదించిన పోలీసులు – సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్ దామోదర్

ఆర్ధిక ఇబ్బందులతో సమీపంలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి వద్ద అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
పోలీసులు ఈ ఘటనపై వివరాలను వెల్లడించారు. వివరాలలోనికి వెలితే.. మార్కాపురం పట్టణంలోలని ఆర్టీసీ బస్టాండ్ వెనక వైపు వెంకటేశ్వర కాలనీ చెందిన 82 సంవత్సరాలు గల బండి రమణమ్మ భర్త చెన్నయ్య మరణించటంతో ఒంటరిగా జీవిస్తున్నది. ఈనెల 14న అదే కాలనీకి చెందిన కురుకుందుల మల్లిఖార్జున రెడ్డి బార్య వసుంధర దండే బోయిన కాశీనాథ్ లు అర్థరాత్రి ఒంటరిగా నివసిస్తున్న బండి రమణమ్మ ఇంటి తలుపు తీసి ఆమె నోరు గట్టిగా మూసి పిడి గుద్దులు గుద్దారు. అరిస్తే చంపుతామని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు, చైన్, సరుడు దోచుకు వెళ్లారు. సంఘటనతో బిత్తర పోయిన ఆమె తెరుకుని చూచే సరికి ఆమె మంచం చుట్టూ కారం పొడి చల్లి ఉండటం గమనించినది.
తెరుకుని ఆమె కొడుకుని పిలిపించుకుని వైద్యశాలలో చేరినది. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పర్యవేక్షణలో డీఎస్సీ యు నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం సీఐ పి సుబ్బారావు నేతృత్వంలో పట్టణ ఎస్సైలు సైదు బాబు, ఎం రాజమోహన్, రూరల్ ఎస్సై అంకమ్మ రావు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
సీసీ పుటేజి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా ముద్దాయిలు అందరూ బంధువులు అయి ఉండి ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు ఎదైనా దొంగతనం చెయ్యాలని తలంచారు. వారి ఇంటికి సమీపంలో ఉన్న వృద్ధురాలి వద్ద బంగారం ఉండటాన్ని ఆమె వాకింగ్ కు వచ్చిన సమయంలో గమనించి ముగ్గురు వ్యక్తులు ఒక పథకం తయారు చేసుకుంటారు. వారి వీధిలో ఉన్న సీసీ కెమోరాను మూడవ వ్యక్తి పైకి నెట్టగా మిగిలిన భార్య భర్తలు ఇద్దరు రమణమ్మ ఇంటి తలుపులు తీసి ఆమెను బెధిరించి దోపిడికి పాల్పడ్డారు.
ముద్దాయిలను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 6.40 లక్షల విలువైన బంగారు చైన్, నాలుగు గ్రాముల గాజులు, 80 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ అభినందనలు….

కేసును చెధింటంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ యూ నాగ రాజు, మార్కాపురం సర్కిల్ సీ ఐ పి సుబ్బా రావు, పట్టణ ఎస్సై లు సైదు బాబు ఎం రాజ మోహన్, రూరల్ ఎస్సై అంకమ రావు, పోలీస్ సిబ్బంది అరుణ గిరి, పి వెంకటేశ్వర్లు, కోటే నాయక్, షరీఫ్, ఎన్ కిషోర్ ను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *