జాతీయ డెంగ్యూ దినోత్సవంను దర్శి అర్బన్ పీహెచ్సీ లో శుక్రవారం నిర్వహించారు.
వైద్యాధికారి డాక్టర్ చేతన్ మలేరియా ఇన్చార్జి బసవా రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ) కపురం శ్రీనివాస రెడ్డి పాల్గొని డెంగ్యూ వ్యాధి సోకటానికి కారణాలు, నివారణ చర్యలను వివరించారు. స్చచ్చత, పరిశుభ్రత పాటించే విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తామని ప్రమాణం చేసారు. హెచ్. వి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

